అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : సినీనటుడు నాగార్జున మంత్రి కొండాసురేఖపై వేసిన పరువు నష్టం దావాపై నాంపల్లికోర్టులో వాదనలు జరిగాయి. ఈసందర్భంగా నాగార్జున తరపు న్యాయవాది ఆశోక్‌ రెడ్డి మాట్లాడుతూ నాగార్జునపై కొండా సురేఖ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్నారు. బాధ్యతయుతమైన మంత్రి పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. ఈవ్యాఖ్యలతో నాగార్జున కుటుంబం మానసికంగా ఎంతో కుంగిపోయిందని తెలిపారు. కచ్చితంగా కొండా సురేఖ క్రిమినల్‌ చర్యలకు అర్హురాలు అని పేర్కొన్నారు.

Advertisement
Advertisement