- అక్షరటుడే, హైదరాబాద్: Arjun Son of Vyjayanthi : ప్రతి తల్లి, మహిళకు ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ (Arjun son of Vyjayanthi) సినిమా అంకితమని సీనియర్ నటి, ఎమ్మెల్సీ విజయశాంతి(Senior actress and MLC Vijayashanti) పేర్కొన్నారు. కల్యాణ్‌రామ్ తో కలిసి విజయశాంతి కీలక పాత్రలో నటించిన చిత్రమిది. సయీ మంజ్రేకర్ కథానాయకి. నూతన దర్శకుడు ప్రదీప్ చిలుకూరి తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో శనివారం నిర్వహించిన చిత్ర ప్రీరిలీజ్ వేడుకకు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ.. “చాలా సంవత్సరాల నుంచి రాములక్క.. ఒక మంచి సినిమా చేయండి.. అని అభిమానులు అడుగుతున్నారు. ‘సరిలేరు నీకెవ్వరు చేశారు.. కానీ, మాకు సరిపోలేదు అని అన్నారు.. ఇదే సమయంలో దర్శకుడు ప్రదీప్ కథ చెప్పడంతో నాకు నచ్చింది. ‘ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని’ ఎడిటర్ తమ్మిరాజు(Editor Tammiraju) చెప్పారు. సెన్సార్ రిపోర్ట్(censor report) కూడా ఇదే చెప్పిందని చెప్పుకొచ్చారు.
మాతృమూర్తి అంటే త్యాగమూర్తి.. తన బిడ్డల బాగుకోసం ఆరాటపడుతుంది. తప్పుడు దారిలో వెళ్తే సన్మార్గంలో నడిపిస్తుంది. ప్రతి మహిళ, తల్లికి మా చిత్రం అంకితం. ఒక తల్లి పడే ఆరాటం.. కొడుకు పోరాటం చక్కగా చిత్రీకరించారు. మా ఇద్దరి మధ్య యుద్ధం(battle) ఏంటనేది చిత్రం చూశాక, మీకే అర్థమవుతుంది. క్లైమాక్స్ (climax0 సైతం పూర్తి భిన్నంగా ఉంటుంది” అని విజయశాంతి వివరించారు.
కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ… “మనం చాలా సినిమాలు చూస్తాం. కొన్ని హిట్ అవుతాయి.. మరొకొన్ని ఫ్లాప్ అవుతాయి.. అయితే కొన్ని చిత్రాలు మాత్రం మనం థియేటర్ నుంచి ఇంటికి వెళ్లినా మనసుకు హత్తుకుని ఉంటాయి. అలాంటి చిత్రమే(movie) మా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి” అని అన్నారు.
జూ.ఎన్టీఆర్ jr ntr మాట్లాడుతూ.. “ఈ వేదికపై నేను, అన్న ఉన్నప్పుడు నాన్నగారు చాలా సార్లు మాట్లాడారు. విజయశాంతి గారు మాట్లాడుతుంటే.. ఆయన లేని లోటు తీరినట్లు అనిపించింది. చాలా మంది హీరోల(heroes)కు దీటుగా సినిమా ఇండస్ట్రీ(film industry)లో నిలిచిన గొప్ప మహిళ విజయశాంతి గారు. ఆమె చేసిన సినిమాలు మరో ఏ హీరోయిన్ చేయలేదు. ‘కర్తవ్యం'(‘Kartavyam’)లో పోలీసు అధికారికి కొడుకు పుడితే ఎలా ఉంటుందన్న ఆలోచనతో ఈ మూవీ వచ్చిందేమో! అని అన్నారు.