అక్షరటుడే,ఆర్మూర్: ఆర్మూర్ ఆర్టీసీ డిపో ప్రైవేట్ అద్దె బస్సు డ్రైవర్ పై ప్రయాణికుల దాడిని నిరసిస్తూ బుధవారం బస్టాండులో డ్రైవర్లు ఆందోళన నిర్వహించారు. కండక్టర్ కోసం హారన్ కొట్టగా కొందరు ప్రయాణికులు వచ్చి దాడి చేయడంతో డ్రైవర్లు నిరసన తెలిపారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆర్మూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం తిరిగి విధులకు వెళ్ళిపోయారు.