అక్షరటుడే, ఆర్మూర్ : పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలో బాలాజీ అపార్ట్మెంట్‌కు ముందు భాగంలో నివాస గృహాల మధ్య రోడ్డుపై ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్, జనరేటర్‌ను తొలగించాలని కాలనీవాసులు కోరుతున్నారు. బుధవారం మున్సిపల్ కమిషనర్ రాజు, విద్యుత్ శాఖ డీఈ నాగేశ్వరరావు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో కాలనీవాసులు రఫీయొద్దీన్, తిరుపతి, సత్యం తదితరులు ఉన్నారు.