అక్షరటుడే, ఆర్మూర్: పట్టణ శివారులోని ఓ రెస్టారెంట్ వద్ద గంజాయి విక్రయిస్తున్న ఒకరిని మంగళవారం అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ సీఐ స్టీవెన్సన్ తెలిపారు. పెర్కిట్ కు చెందిన మహమ్మద్ వహీద్ అలీ నాందేడ్ కు చెందిన ఓ వ్యక్తి నుంచి కిలో ఎండు గంజాయి కొనుగోలు చేశాడు. అందులో నుంచి 200 గ్రాముల గంజాయిని చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసి వికయిస్తుండగా ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. అతని వద్ద నుంచి మిగిలిన 800 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, అలాగే అదే రెస్టారెంట్ వద్ద గంజాయి వినియోగిస్తున్న నలుగురుని తహసీల్దార్ వద్ద బైండోవర్ చేసినట్లు సీఐ తెలిపారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ సిబ్బంది ధర్మేందర్, సందీప్, వికాస్ గౌడ్, నరేష్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.