అక్షరటుడే, ఆర్మూర్: బాధితుల గోడు అధికారులకు పట్టడం లేదు. మంగళవారం అర్ధరాత్రి భారీ వర్షం పడటంతో ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో పలు ఇళ్లలోకి వరద నీరు చేరింది. కాగా.. ఉదయం వరద ప్రాంతాలను మున్సిపల్ కమిషనర్ రాజు పరిశీలించడానికి వస్తున్నారన్న విషయం తెలియడంతో కాలనీలోని పలువురు తమ సమస్యలపై వినతిపత్రం అందజేయడానికి ఎదురు చూశారు. కాలనీకి వచ్చిన కమిషనర్ నిజామాబాద్ లో కలెక్టర్ మీటింగ్ ఉందంటూ కారు నిలపకుండానే వెళ్లిపోయారు. కమిషనర్ తీరుపై కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏడాది వర్షాకాలం తాము ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమ సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు.