అక్షరటుడే, వెబ్ డెస్క్: ఆర్మూర్ సీఐగా తిరిగి రవి కుమార్ కు బాధ్యతలు అప్పగించారు. ఇటీవల నాగపూరి శ్రీనివాస్ ను ఆర్మూర్ సీఐగా బదిలీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయమై సీపీ కల్మేశ్వర్ సీరియస్ అయ్యారు. శ్రీనివాస్ కు ఆర్మూర్ బాధ్యతలు అప్పగించ కూడదని అధికారులను ఆదేశించారు. దీంతో సీఐ రవి కుమార్ అక్కడి బాధ్యతల నుంచి రిలీవ్ కాలేదు. తాజా ఉత్తర్వులతో రవి కుమార్ యథావిధిగా ఆర్మూర్ సీఐగా కొనసాగనున్నారు.