అక్షరటుడే, ఆర్మూర్‌: సీఎం సహాయనిధి చెక్కులను ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి పంపిణీ చేశారు. నందిపేట మండలంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్మూర్‌ నియోజకవర్గంలోని 414 మందికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు. రాజకీయాలకతీతంగా అర్హులైన వారందరికీ అందించామన్నారు. ఇళ్లు కూడా అసలైన నిరుపేదలకే అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ నందిపేట, డొంకేశ్వర్‌ మండలాధ్యక్షులు సాయిరెడ్డి, సురేందర్‌, ఎంపీటీసీలు కొండూరు రాజు, పెయింటర్‌ రాజు, లక్కంపల్లి చిన్నయ్య, సాయికిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.