అక్షరటుడే, ఆర్మూర్: ఆర్మూర్ వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రిని మంగళవారం ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్పిటల్ అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ రోగుల వివరాలను తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది రిజిస్టర్లను పరిశీలించారు. ఆస్పత్రిలో అపరిశుభ్రత, నిర్వహణ తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన ఆర్మూర్ ఎంపీడీవో కార్యాలయంలో దివ్యాంగులకు సహాయ పరికరాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్, డిప్యూటీ డీఎంహెచ్ఓ రమేష్, మున్సిపల్ కమిషనర్ రాజు, సూపరింటెండెంట్ రవికుమార్, వైద్యులు అమృత్, రాంరెడ్డి, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.