అక్షరటుడే, ఆర్మూర్: రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఓటు హక్కు ప్రాముఖ్యతపై శనివారం ఆర్మూర్ పట్టణంలో 2కే రన్ నిర్వహించారు. పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తా వద్ద తహశీల్దార్ గజానన్, మున్సిపల్ కమిషనర్ రాజు, సీఐ రవికుమార్ జెండా ఊపి పరుగును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాజగంగారం, శానిటరి ఇన్స్పెక్టర్ మహేష్, మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.