అక్షరటుడే, ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ మేనేజర్ హయ్యూమ్‌ను సీడీఎంఏకు సరెండర్ చేస్తూ మున్సిపల్ కమిషనర్ రాజు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సీడీఎంఏకు సరెండర్ చేసినట్లు సమాచారం. కాగా మున్సిపల్ కార్యాలయంలో గురువారం కమిషనర్, మేనేజర మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ఒక దశలో ఇరువురు అధికారులు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకున్నారు. ఈ క్రమంలో మేనేజర్‌ను సరెండర్ చేయడం మున్సిపాలిటీలో చర్చనీయాంశంగా మారింది.