ఆర్మూర్‌ మున్సిపల్‌ చైర్ పర్సన్‌గా లావణ్య

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: ఆర్మూర్‌ మున్సిపల్‌ చైర్ పర్సన్‌గా అయ్యప్ప లావణ్య ఎన్నికయ్యారు. గురువారం ఉదయం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆమెను నూతన చైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నారు. ఆర్మూర్‌ మున్సిపల్‌లో మొత్తం 36 మంది కౌన్సిలర్లు, ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా ఉన్నారు. కాగా, సమావేశానికి సరిపోను కోరం సభ్యులు హాజరయ్యారు. వీరి మద్దతుతో లావణ్య చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. అయితే మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పండిత్‌ వినీత, బీజేపీ కౌన్సిలర్లు, మరికొందరు సమావేశానికి గైర్హాజరయ్యారు. ఆర్మూర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక సందర్భంగా క్యాంపునకు వెళ్లిన కాంగ్రెస్‌ కౌన్సిలర్లు గురువారం ఉదయం పట్టణానికి చేరుకున్నారు. డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి, కాంగ్రెస్‌ ఆర్మూర్‌ ఇన్‌చార్జి వినయ్ రెడ్డి కౌన్సిలర్ల వెంట వచ్చారు. అనంతరం చైర్‌పర్సన్‌ రేసులో ఉన్న అయ్యప్ప లావణ్య, ఖాందేశ్‌ సంగీతతో చర్చించారు. చివరకు లావణ్య శ్రీనివాస్ ను చైర్ పర్సన్ గా ఎన్నుకున్నారు.