అక్షరటుడే, ఆర్మూర్: పట్టణ కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన నవనాథ సిద్దుల గుట్ట శివరాత్రి వేడుకల నిర్వహణకు కమిటీ ఏర్పాటైంది. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి పొద్దుటూరి వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఉత్సవాల నిర్వహణ కమిటీని గురువారం ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో భారత్ గ్యాస్ సుమన్, పీసీ గంగారెడ్డి, కోడిగెల మల్లయ్య, సూరజ్, కొంతం మంజుల మురళి, ప్రశాంత్ గౌడ్, జిమ్మి సంధ్య రవి, హజారి సతీష్, శ్రీనివాస్, అలిశెట్టి నరేష్, పొద్దుటూరి చరణ్ రెడ్డి, బట్టు శంకర్ ఉన్నారు.