అక్షరటుడే, ఆర్మూర్: ఆర్మూర్ బస్ డిపో నుంచి శబరిమలకు వెళ్లే సూపర్ లగ్జరీ బస్ రేట్లను భారీగా తగ్గించినట్లు ఆర్మూర్ డిపో మేనేజర్ రవి కుమార్ తెలిపారు. శబరిమలకు గతంలో కిలోమీటర్‌కు రూ.64 ఉండేదని.. దీనిని రూ. 59 కి తగ్గించామని తెలిపారు. నిజామాబాద్ డిపో నుంచి రెండు బస్సులు బుకింగ్ అయ్యాయని, ఆర్మూర్ పట్టణ, పరిసర ప్రాంతాల అయ్యప్ప స్వాములు ఆర్మూర్ డిపో బస్‌లను బుకింగ్ చేసుకోవాలని అయన కోరారు.