అక్షరటుడే, ఆర్మూర్: నిర్మల్ జిల్లా కేంద్రంలో బిట్ కాయిన్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్మూర్ ఎక్సైజ్ ఎస్సై గంగాధర్ సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు వరంగల్ నోడల్ డీసీ అంజన్న బుధవారం ఉత్తర్వులు వెల్లడించారు. యూనిట్ కాయిట్ పేరిట ఆర్థిక మోసాలకు పాల్పడగా ఈనెల 1న గంగాధర్ ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై ఆర్మూర్ ఎక్సైజ్ సీఐ స్టీవెన్సన్ ను సంప్రదించగా ఎస్సై గంగాధర్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెల్లడించినట్లు తెలిపారు.