అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ కల్లెక్టరేట్ లో శనివారం జరిగిన దిశా సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి జూపల్లి పై ఫైర్ అయ్యారు. ఇన్‌ఛార్జి మంత్రి జిల్లాను పట్టించుకోవాదం లేదని మండిపడ్డారు. దీంతో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. జూపల్లి పేషీని పెట్రోల్ పోసి తగలబెడతానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాకుండా జిల్లాలోని అధికారులపై తీరుపై సైతం కూడా మండిపడ్డారు. కనీసం ప్రోటోకాల్ పాటించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.