అక్షరటుడే, ఆర్మూర్‌: మూసి పేదల బతుకులతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆటలాడవద్దని ఆర్మూర్‌ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి అన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్‌ ఆధ్వర్యంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి కారణంగా మూసీ పేదలకు కంటిమీద కునుకు లేకుండా పోయిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మూసీ నుంచి ఎవరినీ తరలించకుండా అడ్డుకుంటామన్నారు. ప్రజల స్థితిగతులను తెలుసుకుని అనంతరం ఇందిరాపార్క్‌ వద్ద ధర్నా చేస్తామన్నారు.