అక్షరటుడే, ఆర్మూర్: డొంకేశ్వర్ మండల కేంద్రం నుంచి నూత్పల్లి లొంక రామాలయం మీదుగా రూ.1.32 కోట్లతో నిర్మించ తలపెట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. డొంకేశ్వర్ చుట్టుపక్కల గ్రామాల లింకు రోడ్లు, నూతన రోడ్లకు నిధులు ఇప్పించే బాధ్యత తనదన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు సురేందర్, సంతోష్ రెడ్డి మారంపల్లి గంగాధర్, చిన్న, గ్రామ వీడీసీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.