అక్షరటుడే, ఆర్మూర్: పేకాడుతున్న ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు ఆర్మూర్ ఎస్సై అనిల్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. కమ్మర్పల్లి గ్రామ శివారులో పేకాడుతుండగా పోలీసులు ఏడుగురిని పట్టుకున్నారు. వారి దగ్గర నుంచి రూ. 30,630 నగదు, ఏడు సెల్ఫోన్లు, నాలుగు బైకులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Advertisement
Advertisement