అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్ నగరంలోని మెడికవర్ ప్రైవేట్ ఆస్పత్రికి ఆరోగ్యశ్రీ ట్రస్టు నోటీసు జారీ చేసింది. ఆరోగ్యశ్రీ సేవల కింద ఓ రోగి ఈ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరగా.. రూ.80 వేలు వసూలు చేసినట్లు ఫిర్యాదు అందింది. పేషంట్ నారాయణ మృతి చెందగా డబ్బులు వసూలు చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బాధిత కుటుంబీకులు నాలుగో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా క్రిమినల్ కేసు నమోదైంది. అలాగే ఆరోగ్యశ్రీ విభాగంలో చికిత్స పొందుతున్న రోగి నుంచి డబ్బులు తీసుకున్న వ్యవహారంపై ట్రస్టు అధికారులు విచారణ చేపట్టారు. దీంట్లో భాగంగానే యాజమాన్యానికి నోటీసు ఇచ్చినట్లు జిల్లా కో ఆర్డినేటర్ శనివారం అధికారికంగా ప్రకటించారు.