Arogyasri | ఆరోగ్య‌శ్రీ సేవ‌లు వినియోగించుకోవాలి
Arogyasri | ఆరోగ్య‌శ్రీ సేవ‌లు వినియోగించుకోవాలి
Advertisement

అక్ష‌ర‌టుడే, బోధ‌న్: Arogyasri | పట్టణంలోని లయన్స్​ కంటి ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ సేవలను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే సుదర్శన్​ రెడ్డి సూచించారు. ఆయన శనివారం ​ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ సేవలను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ 25 ఏళ్లుగా లయన్స్​ కంటి ఆస్పత్రి ఎంతోమందికి సేవలందించిందన్నారు.

తెల్ల రేషన్​కార్డుదారులకు లయన్స్​ ఆస్పత్రిలో ఉచితంగా సేవలందిస్తామని జిల్లా లయన్స్​ కోశాధికారి కొడాలి కిషోర్​ పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు, సబ్​కలెక్టర్​ వికాస్​ మహతో, ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్​బిన్​ హందాన్​, ఏసీపీ శ్రీనివాస్​, లయన్స్​ ఫౌండర్​ భసవేశ్వర్​రావు, నర్సింహారెడ్డి, రమేశ్​, నరేందర్​ రెడ్డి, విఠల్​ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Bodhan | బోధన్‌లో సబ్‌ కలెక్టర్‌ పర్యటన