అక్షరటుడే, జుక్కల్: నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి శివారులో గల అంజనాద్రి ఆలయం నుంచి శనివారం నిర్వహించనున్న మహా పాదయాత్రకు ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు కిషోర్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కుషాల్, ఉపాధ్యాయులు పూజల్లో పాల్గొన్నారు. అనంతరం వెలగనూరు, నర్సింగరావుపల్లి, మంగుళూరు, జక్కాపూర్, మల్లూరు గ్రామాల భక్తులతో మహా పాదయాత్ర గురించి నిర్వాహకులు చర్చించారు. ఈ సందర్భంగా కిషోర్ కుమార్ మాట్లాడుతూ శ్రావణమాసం చివరి శనివారం సందర్భంగా అంజనాద్రి ఆలయం నుంచి రామేశ్వరం గుట్టకు పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. ఈ యాత్ర నర్సింగరావుపల్లి చౌరస్తా, పిట్లం మండలంలోని అన్నారం, కిష్టాపూర్ గ్రామాల మీదుగా సాగుతుందని పేర్కొన్నారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆయన వెంట ఆనంద్ కుమార్, విఠల్, రమేష్ తదితరులు ఉన్నారు.