అక్షరటుడే, కామారెడ్డి: Paddy Centers | జిల్లాలో రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్(COLLECTOR ASHISH SANGWAN) అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో పౌరసరఫరాలు, వ్యవసాయ, పోలీసు, రవాణా, మార్కెటింగ్, సహకార, తదితర శాఖాధికారులతో ధాన్యం కొనుగోళ్లపై నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాట్లాడారు.
ఈ సీజన్‌లో 2.61లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారని, 4.88 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, 1.32లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకం దిగుబడులు రానున్నట్లు చెప్పారు. ఈ మేరకు జిల్లాలో సన్నాల కొనుగోలుకు 63, దొడ్డురకం కోసం 334 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి, సివిల్ సప్లయ్ డీఎం రాజేందర్, డీటీవో శ్రీనివాస్ రెడ్డి, డీఏవో తిరుమల ప్రసాద్, డీఎంవో రమ్య, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.