అక్షరటుడే, వెబ్‌డెస్క్: NIZAMABAD | బోధన్ ఎమ్మెల్యేపై ఎంపీ అర్వింద్ వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణురాజ్ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ భవన్‌లో సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో తెలంగాణ యూనివర్సిటీ, బాసర ట్రిపుల్ ఐటీ, నిజామాబాద్ మెడికల్ కాలేజ్, జీజీహెచ్, వంటి ఎన్నో అభివృద్ధి పనులు కాంగ్రెస్ హయాంలోనే జరిగాయన్నారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆధ్వర్యంలో సుద్దపల్లిలో రూ.120 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరైందని చెప్పారు.
జవహర్ నవోదయ మంజూరుపై సుదర్శన్ రెడ్డి, భూపతిరెడ్డిపై ఎంపీ అర్వింద్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నరందీప్, నాయకులు కిరణ్ రెడ్డి, శివ, సాయికిరణ్, హరీష్, సందీప్, కౌశిక్, అభిలాష్, రాహుల్, జాన్, రేవంత్, తదితరులు పాల్గొన్నారు.