congress | అర్వింద్ దిష్టిబొమ్మ ద‌హ‌నం
congress | అర్వింద్ దిష్టిబొమ్మ ద‌హ‌నం
Advertisement

అక్ష‌ర‌టుడే, నిజామాబాద్ సిటీ: MP Arvind | న‌గ‌రంలోని ఎన్టీఆర్ చౌర‌స్తాలో గురువారం కాంగ్రెస్ నాయ‌కులు ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్ దిష్టిబొమ్మ‌ను ద‌హ‌నం చేశారు. ఈ సంద‌ర్భంగా మాజీ కాంగ్రెస్‌ కార్పొరేట‌ర్ గ‌డుగు రోహిత్ మాట్లాడుతూ కేంద్రీయ విద్యాల‌యం విష‌యంలో మాజీ మంత్రి, బోధ‌న్ ఎమ్మెల్యే సుద‌ర్శ‌న్ రెడ్డిపై ఎంపీ అర్వింద్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తున్నామ‌న్నారు. బోధన్​లో అన్నివర్గాలకు అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో కేంద్రీయ విద్యాలయం కోసం ఎమ్మెల్యే సుదర్శన్​ రెడ్డి స్థలం చూపించారన్నారు. కానీ సుదర్శన్​ రెడ్డిపై అర్వింద్​ అసత్య ఆరోపణలు చేశారన్నారు. మరోసారి ఇలా ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ మైనార్టీ సెల్ నాయ‌కులు మునీర్‌, అబ్బు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Nizamabad | ప్రజావసరాలు పట్టించుకోకుండా విమర్శలా..?