అక్షరటుడే, కామారెడ్డి టౌన్: ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా కామారెడ్డి జిల్లా యువజన – క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం జిల్లా కేంద్రంలో 2కే రన్ నిర్వహించారు. మున్సిపల్ ఆఫీస్ కార్యాలయం నుంచి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వరకు పరుగు కొనసాగింది. అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ శ్రీనివాస్ రెడ్డి జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా యువజన – క్రీడల శాఖ అధికారి జగన్నాథం, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఎన్ఎస్ఎస్ సుధాకర్, అథ్లెటిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జైపాల్ రెడ్డి, ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు, మున్సిపల్ సిబ్బంది, స్పోర్ట్స్ పర్సన్స్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement