అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ: సమగ్ర సర్వేలో భాగంగా అధికారులు, సిబ్బంది ప్రతి ఇంటిని సందర్శించాలని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు ఆదేశించారు. మంగళవారం రెంజల్‌ మండల కేంద్రంలో క్షేత్రస్థాయిలో సర్వేను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఎన్యుమరేటర్‌ రోజుకు 15 ఇళ్ల వరకు సర్వే చేయాలని సూచించారు. కలెక్టర్‌ వెంట రెంజల్‌ తహసీల్దార్‌ శ్రవణ్‌ కుమార్‌ తదితరులున్నారు.