అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : కొత్త మద్యం పాలసీలో భాగంగా ఇవాళ ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వం 3,396 మద్యం షాపులకు లక్కీ డ్రా నిర్వహించింది. డ్రా పద్ధతిలో నూతన నిర్వహకులకు లైసెన్స్‌లు ఇచ్చింది. పేరు వచ్చిన వారు 24 గంటల్లో మొత్తం డబ్బులు డిపాజిట్‌ చేయాలని ప్రభుత్వం రూల్‌ పెట్టింది. ఈరోజు జరిగిన డ్రా పద్ధతిలో మహిళల హవా కొనసాగింది. ఇందులో 345 షాపులు మహిళ పేరు మీద వచ్చాయి. మొత్తం షాపుల్లో 10.2 శాతం మహిళలకు లిక్కర్‌ షాపుల లైసెన్సులు దక్కాయి. మహిళలు అధికంగా వైజాగ్‌లో 31 మద్యం షాపులు దక్కించుకోగా.. అత్యల్పంగా బాపట్ల జిల్లాలో ఒక మహిళకు షాపు లైసెన్సు దక్కింది.