అక్షరటుడే జుక్కల్‌: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించి హరిత తెలంగాణకు పాటుపడదామని జుక్కల్‌ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేపట్టిన ‘వన మహోత్సవం’లో భాగంగా శనివారం నిజాంసాగర్‌ మండలం మంగ్లూర్‌ గ్రామంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎఫ్‌డీవో సాగర్‌, పిట్లం, జుక్కల్‌ రేంజ్‌ అధికారులు సంజయ్‌ గౌడ్‌, సంతోష్‌, మాజీ జడ్పీటీసీ సభ్యుడు జయ ప్రదీప్‌, నిజాంసాగర్‌, మహ్మద్‌ నగర్‌ మండలాల కాంగ్రెస్‌ అధ్యక్షులు మల్లికార్జున్‌, రవీందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.