Advertisement

అక్షరటుడే, ఇందూరు: ప్రజా పాలన విజయోత్సవంలో భాగంగా నిజామాబాద్ రూరల్ మండల విద్యార్థులకు ఆదివారం శంకర్ భవన్ పాఠశాలలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు మండల విద్యాధికారి సేవ్లా నాయక్ బహుమతులను అందజేశారు. మొదటి స్థానంలో తిరుమల(సారంగాపూర్ జడ్పీహెచ్ఎస్), రెండో స్థానంలో దీక్షిత(ముబారక్ నగర్, జడ్పీహెచ్ఎస్), మూడో స్థానంలో రాహుల్(మల్కాపూర్)లు నిలిచారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు అశోక్, సత్యం పాల్గొన్నారు.

Advertisement