అక్షరటుడే, ఆర్మూర్: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు రెండు వరద గేట్లను ఎత్తి గోదావరిలోకి నీటిని వదిలారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 80.501టీఎంసీల నీటి నిల్వ ఉంది. 15,700 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా అంతే మొత్తంలో దిగువకు వదులుతున్నారు. గోదావరి నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదిలోకి దిగి ప్రమాదాలకు గురి కావొద్దని డ్యాం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కొత్త రవి తెలిపారు.