అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: తెలంగాణలోని నిర్మల్‌ జిల్లా కేంద్రంలో శ్రీరాజశ్యామల పీఠంలో అష్టాదశ శక్తి పీఠాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. స్థానిక బంగల్పేట్‌ శివారులోని రాజశ్యామలదేవి ఆలయ ప్రాంగణంలో దుర్గా శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా దశసింహ ఉద్భవమైన ప్రచండ చండికా ప్రతిమను నెలకొల్పారు. అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో సుప్రసిద్ధమైన శక్తి పీఠాల్లోని అమ్మవారి ప్రతిరూపాలను నెలకొల్పారు. దీంతో ఆలయానికి దర్శనం కోసం భక్తుల రద్దీ నెలకొంది.