అక్షరటుడే, కామారెడ్డి: నడిరోడ్డుపై భార్య గొంతు కోసి హత్య చేశాడు ఓ భర్త. అనంతరం తానూ కడుపులో పొడుచుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని ఆర్బీ నగర్‌కు చెందిన నర్సింలు, మహేశ్వరి భార్యాభర్తలు. నర్సింలు చౌరస్తాలో గల సులబ్ కాంప్లెక్స్‌లో పని చేస్తున్నాడు. భార్యాభర్తల మధ్య తరచూ డబ్బుల గురించి వివాదం నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. డబ్బుల విషయమై నర్సింలు శనివారం చౌరస్తా వద్ద మహేశ్వరితో గొడవ పడ్డాడు. అనంతరం వెంట తెచ్చుకున్న చాకుతో మహేశ్వరి గొంతు కోశాడు. ఆపై తానూ కడుపులో పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు వెంటనే నర్సింలును ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్ తీసుకెళ్లారు. ఏఎస్పీ చైతన్య రెడ్డి, సీఐ చంద్రశేఖర్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కుటుంబ కలహాలతో హత్య చేసినట్లుగా ప్రాథమిక విచారణలో తెలిసిందని సీఐ తెలిపారు.
నడిరోడ్డుపై భార్యను హత్య చేసిన భర్త
Advertisement
Advertisement