అక్షరటుడే, జుక్కల్: నిజాంసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ఆశావర్కర్లకు వ్యాధి నిరోధక టీకాలపై అవగాహన కల్పించారు. గురువారం నుంచి ఆశావర్కర్లు ప్రతి ఇంటికి వెళ్లి గర్భిణులు, శిశువుల వివరాలు నమోదు చేయాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రోహిత్ కుమార్, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.