అక్షరటుడే, కామారెడ్డి టౌన్ : నూతనంగా నియామకమైన ఉపాధ్యాయులకు అన్ని జిల్లాల కంటే ముందే ఎంప్లాయ్ ఐడీ ఇచ్చినందుకు గురువారం జిల్లా కార్యాలయంలో పీఆర్టీయూ నాయకులు డీటీవోను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీఆర్టీయూ రాష్ట్ర శాఖ సూచన మేరకు క్లారిఫికేషన్ కోసం డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ ఆఫీసర్స్ రాష్ట్ర ఫైనాన్స్ శాఖను సంప్రదించినట్లు పేర్కొన్నారు. అక్టోబర్ నెల వేతనాల సప్లిమెంటరీ బిల్లుల సమర్పణ తేదీని నవంబర్ 25 వరకు పొడిగించడానికి, అలాగే నవంబర్ వేతన బిల్లులను ఈనెల ఆఖరు వరకు సమర్పించేలా వెసులుబాటును కల్పించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్ట శ్రీనివాస్ రెడ్డి, నాయకులు మాణిక్యం, గోవర్ధన్, నర్సారెడ్డి, సంతోష్ కుమార్, శ్రీనివాస్, బసంత్ రాజ్, స్వామి పాల్గొన్నారు.