అక్షరటుడే, వెబ్‌డెస్క్: ATM on Train | డబ్బులు కావాలంటే డ్రా withdraw చేసుకోవడానికి ఏటీఎంలకు వెళ్తాం. అయితే దూర ప్రాంతాలకు వెళ్లిన సమయంలో అక్కడ ఏటీఎంలు ATMs ఎక్కడ ఉంటాయో మనకు తెలియక ఇబ్బందులు పడుతుంటాం. అయితే ఆ ఇబ్బందులకు చెక్ పెట్టేలా రైల్వే శాఖ సంచలన నిర్ణయం sensational decision తీసుకుంది. ఇక రైళ్లలో కూడా ఏటీఎంలు ATMs in trains ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఇందులో భాగంగా ముంబయి–మన్మాడ్ Mumbai-Manmad పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో Panchvati Express తొలిసారిగా ప్రయోగాత్మకంగా ఏటీఎం ATM ఏర్పాటు చేసింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర Bank of Maharashtra తన ఏటీఎంను ఏసీ కోచ్‌లో AC coach ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. దీనికి షట్టర్ డోర్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఏటీఎంకు వచ్చిన స్పందన ఆధారంగా మిగతా రైళ్లలో కూడా ఏటీఎం ఏర్పాటుకు రైల్వేశాఖ చర్యలు చేపట్టనుంది.