టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్ః Champions Trophy : ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా బిగ్గెస్ట్ క్లాష్‌కి స‌మ‌యం ఆస‌న్న‌మైంది. గ‌తంలో ప‌లు ఐసీసీ ఈవెంట్స్‌లో త‌ల‌ప‌డ్డ భార‌త్ ఆస్ట్రేలియా జ‌ట్లు ఇప్పుడు మ‌రో స‌మ‌రానికి సిద్ధమయ్యాయి.

ఈ హోరాహోరీ పోరులో ఎవరు గెలుస్తారా అని క్రికెట్ ప్రపంచం మొత్తం ఎంతో ఆస‌క్తిక‌రంగా ఎదురు చూస్తోంది. ఇక దుబాయ్ వేదిక‌గా జ‌రుగుతున్న ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఎలాంటి ఆలోచ‌న‌ లేకుండానే బ్యాటింగ్ ఎంచుకుంది . ఇక జ‌ట్టులో ఎలాంటి మార్పులు లేకుండా సెమీస్‌లో ఆసీస్‌తో త‌ల‌ప‌డేందుకు బ‌రిలోకి దిగుతోంది టీమిండియా. ఇక ఆస్ట్రేలియా జ‌ట్టులో ప‌లు మార్పులు చోటు చేసుకున్నాయి.

Champions Trophy : మ‌ళ్లీ టాస్ ఓడిన రోహిత్..

ఐసీసీ టోర్నీలలో టీమిండియా విజయాలకు ఆస్ట్రేలియా ప్రతీసారి అడ్డుకట్ట వేస్తూ వేస్తుండ‌గా, ఆ సంప్ర‌దాయానికి భార‌త్ చెక్ పెట్టాల‌ని భావిస్తుంది. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌తో పాటు అదే ఏడాది వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌లోనూ ఆస్ట్రేలియా చేతిలో భార‌త్ ఘోర ప‌రాజ‌యాన్ని చ‌విచూసింది. వాటికి ప్ర‌తీకారంగా ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో ఎలాగైనా గెల‌వాల‌ని భార‌త్ క‌సిగా ఆడ‌నుంది. ఇప్ప‌టికే ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో దుబాయ్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ గెలిచి హ్యాట్రిక్‌ విజయాలతో ఫుల్ జోష్‌లో ఉంది. భారత జ‌ట్టు. ఇక ఆసీస్ ఇప్పటివరకు దుబాయ్ పిచ్‌పై ఒక్క మ్యాచ్ కూడా ఆడింది లేదు. సానుకూల అంశాలు భార‌త్ వైపే ఉండ‌గా, మ‌రి ఈ ఫైట్‌లో ఎవ‌రు విజ‌యం సాధిస్తారో చూడాలి.

ఇది కూడా చ‌ద‌వండి :  Team India Cricketer : అప్పుడు జీరోగా ఉన్న ఇత‌ను ఇప్పుడు క్రికెట్ అభిమానుల‌కి హీరో అయ్యాడు

Champions Trophy : టీమిండియా తుది జట్టు :

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి

Champions Trophy : ఆస్ట్రేలియా తుది జట్టు :

కూప‌ర్, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లాబుషేన్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), అలెక్స్ క్యారీ, గ్లెన్ మాక్స్‌వెల్, బెన్ డ్వారాషూస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, త‌న్వీర్ సంఘా

Advertisement