Advertisement

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో నేటి నుంచి కొత్త మోటార్ వెహికల్ చట్టం(New Motor Vehicle Act) అమలు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. నూతన మోటారు వాహనాల చట్టం ప్రకారం.. ట్రాఫిక్ నిబంధను పాటించకపోతే భారీగా జరిమానా విధించనున్నారు. డ్రైవింగ్ లైసెన్స్(driving license) లేకుండా వాహనం నడిపితే రూ.5000 జరిమానాతో పాటుగా వాహనం సీజ్ చేసే అవకాశం ఉంది.

డ్రంకన్ డ్రైవ్ కేసులో పట్టుబడితే..

హెల్మెట్(helmet) లేకుండా బైక్ నడిపితే రూ.1,000 జరిమానా వేస్తారు. సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కారు నడిపితే రూ.1000 కట్టాల్సిందే. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు(drunk and drive case)లో పట్టుబడితే రూ.10,000 జరిమానాతో పాటు లైసెన్స్ రద్దు చేస్తారు.

ఇది కూడా చ‌ద‌వండి :  CM Chandrababu | ఉమెన్స్ డే రోజు భార్యకు సీఎం చంద్రబాబు స్పెషల్ గిఫ్ట్..

సీసీ కెమెరాల ద్వారా..

ఓవర్ స్పీడ్, సిగ్నల్ జంప్, రాంగ్ రూట్ డ్రైవింగ్ కేసుల్లో రూ.1000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. సీసీ కెమెరాల(CCTV cameras) ద్వారా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి జరిమానాలు వేయనున్నారు.

Advertisement