Conocarpus | హైదరాబాద్​లో భారీగా కోనోకార్పస్ చెట్లు.. తొలగిస్తున్న అధికారులు

Conocarpus | హైదరాబాద్​లో భారీగా కోనోకార్పస్ చెట్లు.. తొలగిస్తున్న అధికారులు
Conocarpus | హైదరాబాద్​లో భారీగా కోనోకార్పస్ చెట్లు.. తొలగిస్తున్న అధికారులు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Conocarpus | పచ్చని చెట్టు కింద కూర్చుంటే ఆహ్లాదంతో(Brings joy) పాటు ఆరోగ్యం(good health) బాగుంటుంది. అయితే ఈ చెట్టు కింద కూర్చుంటే మాత్రం అనారోగ్యానికి గురువుతాం.. అదే కోనోకార్పస్(Conocarpus Tree). ప్రకృతికి, పర్యావరణానికి ఎలాంటి మేలు చేయకుండా సులువుగా పెరిగే ఈ మొక్కతో మానవాళికి ముప్పుగా మారింది. ఆక్సిజన్​(Oxygen) పీల్చుకొని కార్బన్​ డై ఆక్సైడ్​(Carbon Dioxide) విడుదల చేసే ఈ మొక్కతో మనుషులకు శ్వాస సంబంధ వ్యాధులు వస్తాయి. దీంతో వీటిని తొలగించాలని ఇటవల అసెంబ్లీలో స్పీకర్​ ప్రసాద్​(Assembly Speaker Prasad) ప్రభుత్వానికి సూచించారు.

Advertisement
Advertisement

Conocarpus | సులువుగా పెరుగుతాయని..

కోనోకార్పస్ చెట్లు(Conocarpus trees) సులువుగా పెరుగుతాయి. తక్కువ కాలంలో ఏపుగా పెరుగుతాయని బీఆర్​ఎస్​(BRS) హయాంలో హరితహారంలో భాగంగా వీటిని అధికారులు నాటారు. జీహెచ్​ఎంసీ(GHMC) పరిధిలో రెండు లక్షల(Two Lacks)కు పైగా కోనోకార్పస్ చెట్లు(Conocarpus trees) ఉన్నట్లు ఇటీవల గుర్తించారు. ఒక్కో మొక్క నాటడానికి రూ.100కు పైగా ఖర్చు చేశారు. పంజాగుట్ట(Panja Gutta), ఖైరతాబాద్(Khairatabad), టోలిచౌకీ(Toli Chowki)తో పాటు రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీల్లో భారీగా కోనోకార్పస్ మొక్కలు నాటారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Hit and run | అబ్దుల్లాపూర్‌మెట్‌ కోహెడలో హిట్‌ అండ్‌ రన్‌ కేసు

Conocarpus | స్పీకర్​ సూచనతో..

స్పీకర్​ గడ్డం ప్రసాద్​ కుమార్(Speaker Gaddam Prasad Kumar)​ ఇటీవల అసెంబ్లీలో(Assembly) హరితహారంలో భాగంగా నాటిన కోనోకార్పస్​ చెట్లతో(Conocarpus trees) పర్యావరణానికి కీడు జరుగుతుందని చెప్పారు. వెంటనే వాటిని తొలగించాలని ప్రభుత్వానికి సూచించారు. దీంతో అధికారులు తొలగింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా టోలిచౌకీ(Toli Chowki)లో దాదాపు 30 కోనోకార్పస్ చెట్లను తొలగించారు. మిగతా ప్రాంతాల్లో కూడా వీటిని తొలగించి, భవిష్యత్​(Future)లో ఎక్కడ నాటకుండా చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement