అక్షరటుడే, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా మొలకల చెరువు సమీపంలోని కస్తూర్బా బాలికల విద్యాలయంలో సభ్య సమాజం తలదించుకునేలా అధికారులు ప్రవర్తించారు. విద్యాలయంలో తనిఖీ కోసం వెళ్లిన సామాజిక తనిఖీ సిబ్బంది (ఏపీ సోషల్ ఆడిట్ టీమ్)తో అక్కడి విద్యార్థినులు తమ సమస్యలను ఏకరవు పెట్టగా.. అక్కడ బాలికలపై జరుగుతున్న వేధింపులు వెలుగులోకి వచ్చాయి. తమతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని బాలికలు వాపోయారు. పురుగుల ఆహారం పెడుతున్నారని ఆరోపించారు. నెలసరి సమయంలో శానిటరీ ప్యాడ్ కోసం వెళితే.. పీరియడ్స్ వచ్చినట్లు ఆధారాలు చూపించాలని అడుగుతున్నారని కన్నీటి పర్యంతమయ్యాయి. బాలికల సమస్యలు విని విస్తుపోయిన సామాజిక తనిఖీ సిబ్బంది వెంటనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన విద్యాశాఖ దీనికి బాధ్యులైన ప్రిన్సిపల్, ఏఎన్ఎంలను సస్పెండ్ చేసింది.
Advertisement
Advertisement