అక్షరటుడే, వెబ్‌డెస్క్ : మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఇళ్ల కూల్చివేతను అధికారులు మంగళవారం ప్రారంభించారు. చాదర్‌ఘాట్, శంకర్‌నగర్ కాలనీలో వీధులు ఇరుకుగా ఉండడంతో స్వచ్ఛందంగా ఖాళీ చేసిన నిర్వాసితుల ఇళ్లను కూలీల సహాయంతో కూల్చివేస్తున్నారు. దాదాపుగా 140 ఇళ్లు ఖాళీ అయ్యాయి. నిర్వాసితులను డబుల్ బెడ్రూం ఇళ్లకు తరలిస్తున్నారు. సామగ్రి తరలింపునకు వాహనాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంతరాలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించారు.