అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | ఆటో ఢీకొని ఓ విద్యార్థికి తీవ్ర గాయాలైన ఘటన నగరంలోని కంఠేశ్వర్ మీసేవా కేంద్రం వద్ద చోటు చేసుకుంది. ఈ ఘటనలో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
వివరాల్లోకి వెళ్తే.. సుభాష్‌నగర్‌లోని కాకతీయ ఒలింపియాడ్‌లో విద్యార్థి కౌషిక్ 9వ తరగతి చదువుతున్నాడు. సోమవారం ఉదయం స్కూల్‌కు వెళ్లేందుకు కంఠేశ్వర్‌లోని మీసేవా కేంద్రం వద్ద సైకిల్‌పై రోడ్డు దాటుతుండగా ఆటో బలంగా ఢీకొట్టింది. దీంతో కౌషిక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు బాలుడికి స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాలుడి తండ్రి ప్రసాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా.. ఈ కేసులో రాజీ కావాలంటూ అప్పుడే పలువురు ఒత్తిడి తేవడం గమనార్హం.