అక్షరటుడే, ఇందూరు: ఏఐటీయూసీ ఆటో డ్రైవర్ యూనియన్ రాష్ట్ర మహాసభలు ఈనెల 22, 23 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ హనుమాండ్లు తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బోధన్ బస్టాండ్ వద్ద ఇందుకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహాసభలు కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరుగుతాయన్నారు. ప్రధానంగా మోటార్ వెహికల్ రంగంలో తీసుకొస్తున్న సవరణలను విరమించుకోవాలని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూ.12 వేలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు సాయి, అజీజ్ అహ్మద్, గంగారాం, సాయిలు తదితరులు పాల్గొన్నారు.