వేసవిలో విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలి
వేసవిలో విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలి
Advertisement

అక్షరటుడే, ఇందూరు: వేసవిలో విద్యుత్​ సమస్యలు రాకుండా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని టీజీఎన్పీడీసీఎల్(TGNPDCL)​ ఎస్​ఈ(ఆపరేషన్స్​) రవీందర్​ ఆదేశించారు. గురువారం పవర్​హౌజ్(POWER HOUSE)​లో డీఈలు, ఏఈడీలు, ఏఈలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రూ. 6 కోట్లతో ఆర్​ పవర్​ ట్రాన్స్​ఫార్మర్లు(POWER TRASFORMERS) ఏర్పాటు చేశామని, రూ. 13.1 కోట్లతో 43 ఇంటర్​ లింకింగ్​ లైన్లు ఏర్పాటు చేశామన్నారు. అలాగే 130 అదనపు ట్రాన్స్​ఫార్మర్లు ఏర్పాటు చేశామని వివరించారు. 126 డిస్ట్రిబ్యూషన్​ ట్రాన్స్​ఫార్మర్ల స్థాయిని పెంచామని, అదనంగా జిల్లాలో 26 కొత్త వీసీబీలు అమర్చామన్నారు. మార్చి చివరివారం లోపు పెండింగ్​ పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో జనరల్​ మేనేజర్లు వెంకటకృష్ణ, ఎస్​ఏవో శ్రీనివాస్​, డీఈలు పీవీ రాజేశ్వరరావు, ఎం. శ్రీనివాస్​, ఉత్తమ్​, ఎండీ ముక్తార్​, వెంకటరమణ, ఏడీఈలు, ఏఈలు, ఏఏవోలు పాల్గొన్నారు.

Advertisement