అక్షరటుడే, ఇందూరు: Nizamabad | పాఠశాల విద్యలో పదో తరగతి(Tenth exams) ఎంతో కీలకం. రేపటి (శుక్రవారం) నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు విద్యార్థులు ఒత్తిడి(stress)కి గురయ్యే అవకాశముంది. అయితే ఇలాంటి విద్యార్థులు(students) ఆత్మస్థైర్యంతో(confidence) ముందుకెళ్లాలని.. భయాన్ని వీడి ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష రాయాలని ప్రముఖ మానసిక వైద్యులు, ఇండియన్ సైకియాట్రీ సొసైటీ(Indian Psychiatry Society) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ విశాల్(Dr Vishal Nizamabad) సూచించారు. పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు పలు సూచనలు చేశారు.
- చదువు(study)కునే సమయంలో ప్రతి గంటకు కనీసం 15 నిమిషాలు విరామం తీసుకోవాలి. దీంతో చదివిన అంశాలు(topics) బాగా గుర్తుంటాయి.
- బద్ధకం, అతినిద్ర దగ్గరకు రాకుండా ఉండాలంటే యోగా, వ్యాయామం(yoga and exercise) చేయాలి.
- వేకువజామున నిద్రలేచి చదువుకోవడం ఎంతో మంచిది. దీనివల్ల సబ్జెక్టు(subject)ను సులువుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది.
- పరీక్షలను(exams) సొంతంగా రాయడానికి ప్రయత్నించాలి. గైడ్లలో చూసి బట్టీపట్టడం మానేయాలి.
- చేతిరాతను అందంగా(Hand writing) రాసేలా ప్రాక్టీస్(Practice) చేయాలి. అలాగే అవసరమైనంత వేగంగా రాయాలి.
- పరీక్షలకు వెళ్లేముందు పరీక్ష విధానం(exam pattern) గురించి స్పష్టంగా తెలుసుకోవాలి. ఉపాధ్యాయులు (teachers) చెప్పిన మెలకువలను క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి.
- కష్టతరమైన సబ్జెక్టు(difficult subjects)పై ఎక్కువగా శ్రద్ధ వహించాలి.