అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Medicover Hospital | నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుట్టలో మెడికవర్ ఆస్పత్రిలో గురువారం ప్రపంచ మూత్రపిండాల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కిడ్నీ వ్యాధులపై నిర్వహించిన అవగాహన సదస్సులో వైద్యుడు అజయ్‌కుమార్ విశ్వంత్ పాటిల్ పాల్గొని మాట్లాడారు. మూత్రపిండాల వ్యాధులను నిర్లక్ష్యం చేయవద్దని, సంబంధిత వైద్యులను సంప్రదించాలని సూచించారు.
మెడికవర్ హాస్పిటల్స్ అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్ కూరపాటి యజ్ఞ, డైటీషియన్ శ్రీలేఖ మాట్లాడుతూ.. ప్రపంచ మూత్రపిండాల దినోత్సవం సందర్భంగా కిడ్నీల ఆరోగ్యంపై అవగాహన కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూరాలజిస్ట్ సతీష్, సెంటర్ హెడ్ స్వామి, మార్కెటింగ్ మేనేజర్ వినయ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.