అక్షరటుడే, ఇందూరు: Bhu Bharathi | భూభారతి చట్టంపై రైతులు అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు(Collector Rajiv Gandhi Hanumanthu) సూచించారు. శుక్రవారం డిచ్పల్లి (dichpally) మండలంలోని నడిపల్లి(nadipally), మోపాల్(mopal) మండల కేంద్రంలో అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఏప్రిల్ 14న భూభారతి చట్టాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని తెలిపారు. భూ సమస్యలు(land issues) కలిగిన రైతులు ఏడాది కాలంలోపు ఈ పోర్టల్(portal) ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అవగాహన సదస్సుల అనంతరం మే మొదటి వారంలో అధికారులు గ్రామాల వారీగా సదస్సులను ఏర్పాటు చేసి, అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు.
ఆధార్ కార్డులాగా(aadhar card) భూమికి భూదార్ (Bhudhar) సంఖ్య కేటాయిస్తారని పేర్కొన్నారు. సదస్సులో నిజామాబాద్ ఆర్డీవో(RDO) రాజేంద్రకుమార్, ఐడీసీఎంఎస్(IDCMS) ఛైర్మన్ తారాచంద్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ(Market committe) ఛైర్మన్ ముప్ప గంగారెడ్డి, డిచ్పల్లి మండల స్పెషల్ ఆఫీసర్ యోహాన్, రైతులు పాల్గొన్నారు.