అక్షరటుడే, నిజామాబాద్‌ రూరల్‌: డిచ్‌పల్లిలో బుధవారం ఆయుష్‌ శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా ఆయుష్‌ ఇన్‌ఛార్జి డాక్టర్‌ నారాయణరావు మాట్లాడుతూ.. ఆయుర్వేద మందులతో ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్‌లు ఉండవన్నారు. ఈ శిబిరంలో వృద్ధులకు పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. డాక్టర్లు సుశాంత్‌రెడ్డి, సందీప్‌, డీపీఎం వందనరెడ్డి, సిబ్బంది మురళి, ధనలక్ష్మి, నవీనత, రమేశ్‌, మాజిద్‌ పాల్గొన్నారు.