అక్షరటుడే ,ఎల్లారెడ్డి: అన్ని వర్గాల వారికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు అన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఆదివారం లింగంపేట్ లో గల ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని, ఆయన ఆశయాలను నెరవేర్చాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు నారా గౌడ్, సంతోష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.