అంబేడ్కర్ ఆశయ సాధన కోసం పనిచేయాలి

0

అక్షరటుడే, జుక్కల్: అంబేడ్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరముందని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు అన్నారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆదివారం మద్నూర్ మండల కేంద్రంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంటరానితనాన్ని రూపుమాపుటకు, సమసమాజ నిర్మాణం కోసం అంబేడ్కర్
ఎంతో కృషి చేశారని కొనియాడారు. రాజ్యాంగం ద్వారా అందరికీ సమాన హక్కులు కల్పించారని, ఆయన మార్గంలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.